మా సిద్ధాంతాలు ఇవే

స్వేచ్ఛ వివక్షత జోక్యం చేసుకోకూడదు పరిమిత పాలన వికేంద్రీకరణ సకాలంలో న్యాయం ప్రజా సంపదను ప్రజాసంక్షేమానికే ఉపయోగించాలి

ఇంకా చదవండి

ప్రైమరీస్ ప్లాట్ఫాం

పాలన మరియు రాజకీయాలలో ఒక కొత్త మోడల్. అన్ని స్థాయిలలో అభ్యర్థులను మీరే ఎంచుకుని పోటీ చేయండి

ఇంకా చదవండి

ఈ ఉద్యమంలో చేరండి

నయీదిశ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు(FAQs)

నయీదిశ అంటే ఏమిటి? దీని వెనక ఉన్నది ఎవరు మరియు మీరు ఏం సాధించాలని ప్రయత్నిస్తున్నారు?

నయీదిశ భారతీయులను సంపన్నబాటలో నడిపించటానికి మొదలైన ఒక స్వతంత్ర రాజకీయ వేదిక. దీని లక్ష్యం మన దేశం పనితీరులో ప్రాథమిక స్థాయి నుంచి మార్పులు కోరుకునే భారతీయులందరినీ ఒక చోటికి తేవడం. బిలియన్ కన్నా ఎక్కువమంది జనాభా ఉన్న మనదేశం యొక్క భవిష్యత్తు మెరుగవ్వాలంటే, కోల్పోయిన గత వైభవం తిరిగి రావాలంటే భారతదేశానికి రాజకీయ మరియు ఆర్థిక విప్లవం సరికొత్తగా మొత్తం వ్యవస్థను మార్చే విధంగా ఉండాలని నయీదిశ నమ్ముతోంది. మా లక్ష్యం వివరాలను మేనిఫెస్టోలో manifesto and statement of purpose.

నయీదిశ రాజకీయ రంగంలో ఇలాంటి మార్గంలో ఏర్పడిన మొదటి వేదిక. మీకు దేశం పట్ల ఆలోచనలుంటే, మీ నియోజక అభివృద్ధిపై ఆలోచనలుంటే, మన దేశం సుసంపన్నం అవటానికి మీరేం చేయగలరని ఎప్పుడైనా ఆలోచించి ఉంటే, ఈ వేదిక మీ కోసమే. మా వేదిక యొక్క పూర్తి వివరాలు మరియు సమాచారం దొరుకుతాయి ఇక్కడ here.

మీరు మా వేదికను రాజకీయాల్లో ఊబర్/ఓలా లేదా జొమాటోగా అనుకోవచ్చు, కానీ మా స్వంతంగా ఏ అభ్యర్థి ఇందులో లేడు మరియు మేము ఒక రాజకీయ పార్టీ కూడా కాదు.

మేమొక అన్ని రంగాలకి చెందిన మరియు Rajesh Jain, అన్ని వయస్సులకి చెందిన వారితో, డిజిటల్ గా బలంగా మారిన వేదిక మాత్రమే – మా బృందంలో విద్యార్థులు, వ్యాపారవేత్తలు, వకీళ్ళు, ఆర్థికనిపుణులు, రైతులు మరియు యువ ప్రొఫెషనల్స్ అందరూ ఉన్నారు.

మీకు ఇంకా ప్రశ్నలుంటే మా ఎఫ్ ఎ క్యూ'స్ పేజీని దర్శించండి

నయీదిశ యొక్క లక్ష్యం మరియు మిషన్ ఏమిటి?

నయీదిశ, మన దేశం యొక్క గమ్యం పేదరికం కాదని నమ్ముతుంది. మా లక్ష్యం భారతీయులకి ఎక్కువకాలం నిలిచి ఉండే సంపదను తీసుకురావడం, అది కూడా ఒక శతాబ్ద సమయంలో కాదు, రెండు ఎన్నికల మధ్యలోనే.

నయీ దిశ యొక్క మిషన్ 543 సంపదను, సమృద్ధిని కోరుకునే వోటర్లను, అది సృష్టించాలని తపనపడే అభ్యర్థులను ఒక తాటిపైకి తెస్తుంది. మేము బరిలోకి దిగి, 2019 లోక్ సభ ఎన్నికలలో 543 సీట్లలో ఎక్కువ మెజారిటీతో గెలవాలనుకుంటున్నాం. ప్రభుత్వం ఏర్పరిచి, భారతీయులను ఇక ఎన్నటికీ పేదరికంలోకి వెనక్కి వెళ్ళకుండా ఉండేలా ఒక అజెండాను నెలకొల్పాలనుకుంటున్నాం.

మేము ఈ కింది సిద్ధాంతాలను అనుసరిస్తూ మా గమ్యంకై కృషి చేస్తాం:
1. స్వేఛ్ఛ
2. వివక్ష లేని పాలన
3. జోక్యం లేని పాలన
4. పరిమిత ప్రభుత్వం
5. వికేంద్రీకరణ
6. సమయానుసారంగా న్యాయం
7. ప్రజా సంపదను తిరిగి వారి సంక్షేమానికి వాడటం

మా వేదిక మరియు మ్యానిఫెస్టో గురించి మరింత చదవండి.

నయీదిశ భారతీయులందరికీ సంపద సమృద్ధిని తేవాలని ఎలాంటి విధానం ప్లాన్ చేస్తోంది?

నయీ దిశ అందించే రెండు ముఖ్య పరిష్కారాలు – కుటుంబానికి ఏడాదికి 1 లక్ష రూపాయల చొప్పున తిరిగివ్వటం మరియు పన్నులను ప్రతి కుటుంబానికి వార్షికంగా మొత్తం 1.5 లక్షల రూపాయల మినహాయింపు వచ్చేట్లుగా 10% -వద్దనే నియంత్రించడం.

అందరి చేతిలో ఎక్కువ డబ్బును పెట్టడం కన్నా, ఈ పథకాలు ప్రతి భారతీయ కుటుంబానికి ఆర్థిక సురక్షతను కల్పించి, పేదరికాన్ని తొలగించి , ఉద్యోగాలను ఎక్కువగా సృష్టించి, ప్రభుత్వ అభివృద్ధిని తగ్గించి, భారతపౌరులు తమ సంపదను సృష్టించుకునేలా, పెంచుకునేలా చేస్తుంది, సాధికారతను ఇస్తుంది. ఈ డబ్బు ప్రభుత్వ దుర్వినియోగాన్ని మరియు అసమర్థతను తగ్గించి, ప్రభుత్వానికి చెందిన వాడని లేదా ఉపయోగపడని వ్యాపార వనరులను మూసివేసి లేదా అమ్మేయటం ద్వారా వస్తుంది. పన్నుపై 10శాతం నియంత్రణ ప్రభుత్వ అవసరాలకి తగినంత నిధులు ఉండేలా చేస్తుంది, అత్యాశకి కాదు.

Read more about our vision.

నయీదిశ యొక్క సంస్థాపక వ్యవస్థ ఏమిటి?

నయీదిశ బృందంలో అన్ని రంగాలకి చెందిన ఆలోచనాపరులైన, నిబద్ధతకి కట్టుబడిన వ్యక్తులు ఉన్నారు. వీరందరి లక్ష్యం మన దేశంలో రాజకీయాల పనితీరును పూర్తిగా మార్చటం. మీరు కూడా నయీదిశ లక్ష్యాన్ని, ఆశయాన్ని నమ్మితే, సభ్యులుగా మారి, మన దేశం సంపన్న దేశంగా మారటానికి మాతో కలసి పనిచేయండి.

Be a part of our vision, join Nayi Disha.

నయీదిశ దేశాన్ని సంపన్నబాటలో నడిపిస్తామని ప్రమాణం చేస్తోంది.కుటుంబానికి ఒక లక్ష రూపాయలు భారతీయులను సంపన్నులుగా మారుస్తుందని మీరు భావిస్తున్నారా?

30 కోట్లకి పైగా భారతీయులు దారుణమైన పేదరికంలో నివసిస్తున్నారు. సగటు భారతీయ కుటుంబం యొక్క ఏడాదికి వచ్చే ఆదాయం కేవలం 1.2లక్షలు మాత్రమే. ప్రతి కుటుంబానికి ప్రతి సంవత్సరం 1 లక్షను తిరిగివ్వటం వలన సగం భారతీయ కుటుంబాల ఆదాయం రెట్టింపవుతుంది. తమ జీవితాలను మార్చుకోటానికి చాలా మందికి ఈ డబ్బు సరిపోతుంది.

పైగా, నయీదిశ తీసుకొచ్చే ఇతర మార్పులు ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తాయి మరియు చిన్న మరియు పెద్ద వ్యాపారస్తులకు వ్యాపారం చేయటం సులువుగా మారుస్తాయి.

మీ హామీలు మరో రాజకీయ ఎత్తుగడలా కన్పిస్తున్నాయి-ఈ సారి మోడీ నుంచి రాలేదు కానీ నయీదిశ నుంచి వచ్చాయి అంతే. నేను మిమ్మల్ని ఎందుకు నమ్మాలి?

ఇది మరో రాజకీయ ఎత్తుగడ కాదు. నయీదిశ సభ్యులు ప్రభుత్వం ప్రస్తుతం దుర్వినియోగం చేస్తున్న లేదా వాడని ప్రజాధనాన్ని, దాని హక్కుదారులైన భారతీయులకి తిరిగి ఇస్తామని హామీ ఇస్తోంది. రాజేష్ జైన్ అనే విజయవంతమైన వ్యాపారవేత్త, తన వనరులను మరియు సమయాన్ని ధనికదేశాల సరసన చేరే భారతదేశం కోసం వెచ్చిస్తున్నారు. నయీదిశ బృందం ఈ సమస్యపై చాలా లోతైన పరిశోధన చేసి, ప్రజాసంపదను సేకరించి మరియు దానిని తిరిగివ్వటానికి వివరంగా ప్లాన్ ను రూపొందించి మీ ముందుకు వచ్చింది, మేము గాలిలో హామీల మేడలు కట్టటం లేదు.

నయీదిశకి సంబంధించి మా ప్రేరణ గురించి మరింత చదవండి

భూములు మరియు గనులను ఎవరు కొంటారు?మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉచితంగా భూములు పొందే అవకాశం ఉన్నప్పుడు వేలంపాటలో వాళ్ళు ఎందుకు పాల్గొంటారు?విదేశీయులు కూడా ఇందులో పాల్గోటానికి అనుమతిస్తారా?

మొదటగా, ఏ దేశ ప్రభుత్వం కూడా విలువైన వనరు అంటే భూమిలాంటిది పరిశ్రమలకు ఉచితంగా ఇచ్చేయదు. ఈ వనరులు దేశానికి చెందినవి అంటే అక్కడి ప్రజలవి. ఇవి ఉచితంగా ఇచ్చేయటం అంటే మన న్యాయపర హక్కును ప్రభుత్వం దోచేసుకుంటోందని అర్థం. రెండవది, ప్రస్తుతం మన దేశంలో చట్టపరమైన సమస్యలు, నియమాలు సరిగా లేకపోవటం వలన ప్రజావనరులను కొనేవారు ఎవరూ లేరు. ప్రజల దగ్గర డబ్బు ఉండి, వ్యాపారం చేసే ప్రక్రియ సులభమైనప్పుడు, వ్యక్తులు మరియు సంస్థలు వనరులను వృథా చేయకుండా వాడాల్సిందేనని డిమాండ్ చేయగలవు.

మన దేశంలో స్థలం లేదా భూమి కొనుగోలు చేసే విషయంలో విదేశీయులను మరియు సంస్థలను భారతీయులతో సమానంగా చూడాలి. మా ఉద్దేశ్యం భారతీయులకి అధిక మొత్తాలలో లాభాలు రావటం. కాకపోతే,దాంతోపాటు దేశ రక్షణకి సంబంధించిన వనరులకి ఈ లాభనష్టాలనుంచి మినహాయింపు ఉంటుంది.

సమీప భవిష్యత్తులో ప్రజాసంపద పూర్తిగా ఖర్చయిపోతే ఏం జరుగుతుంది?

ఇంతకుముందే చెప్పినట్లు, కుటుంబానికి ఏడాదికి 1 లక్ష రూపాయల చొప్పున పంచినా మన దేశంలో ప్రజాసంపద 50 ఏళ్ల పాటు తరగకుండా వస్తుంది. ఈ సంపదతో కొన్ని దశాబ్దాలు గడిచాక మనకి ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు లేదా డబ్బును సమానంగా అందరికీ పంచే ఆలోచనలు అవసరం ఉండవు ఎందుకంటే అప్పటికి భారతీయులందరూ డబ్బున్నవారై, తమ జీవితాలు ఎలా ఉండాలో వారే నిర్ణయించుకుంటారు.

నయీదిశ పేదలకు ఏం చేస్తుంది?వారికి ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత మనది కాదా?

నయీదిశ ప్రతి సంవత్సరం 1 లక్ష రూపాయల చొప్పున మన దేశంలో ఇంటింటా ప్రజాధనాన్ని తిరిగిచ్చే లక్ష్యాన్ని పెట్టుకుంది, మరియు పేదవారికి ఆర్థిక అవకాశాలు పెరిగేలా కొత్త మార్పులు తేవాలనుకుంటోంది. దీనివలన అవకాశాలు లేక వచ్చే పేదరికం, సామాజిక మరియు ఆర్థిక వనరులు లేకపోవటం వలన వచ్చే దారుణ పేదరిక వలయాన్ని పగలగొట్టడంలో సాయం అవుతుంది. ప్రస్తుతం చాలామంది భారతీయులు ఈ వలయంలోనే చిక్కుకొని ఉన్నారు.

ప్రజాసంపదను తిరిగివ్వటం ఒకటే కాక, భారత యువతకి లక్షలాది ఉద్యోగాలు కావాలని నయీదిశ గుర్తించింది. ఈ ఉద్యోగాలు, వ్యాపారాలు పెట్టడానికి పెట్టుబడి,మరియు సరైన వాతావరణం ఉంటే తప్ప కొత్తగా సృష్టించబడవు. నయీదిశ ఆర్థిక వ్యవస్థకు స్వేఛ్చనిచ్చి ప్రజలు మరిన్ని వ్యాపారాలు ప్రారంభించేలా, ఆ విధంగా మరిన్ని ఉద్యోగాలు సృష్టించేవిధంగా ప్రోత్సహించాలని భావిస్తోంది. అదనంగా, ప్రజలు ఆ డబ్బును మంచి ఉద్యోగం పొందటం కోసం సరైన ఉద్యోగ నైపుణ్యాలు నేర్చుకోటానికి లేదా చదువు కోసం వాడుకోవచ్చు.

Read more about our vision.

నయీదిశ భారతీయ ఎన్నికల కమీషన్ లో రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీనా?కాకపోతే, ఎలా మరియు ఎప్పుడు ఇది ఒక వేదిక నుంచి పార్టీగా రూపాంతరం చెందుతుంది?

కాదు, నయీదిశ రాజకీయ పార్టీగా రిజిస్టర్ అవలేదు. మాది పాలన మరియు రాజకీయాలను మెరుగ్గా మార్చే అవకాశం ఉన్న ఒక వేదిక మాత్రమే. మా శక్తి కూడా ఒక వేదికగా ఉండటంలోనే ఉంది – ఒకే లక్ష్యం ఉన్నవారిని ఒక బ్యానర్ కిందకి తెచ్చి భారతదేశాన్ని సంపన్నదేశంగా మార్చే వేదిక. నయీదిశకి లేనిది ఒక్కటే, పార్టీగా ఉండి ఎన్నికల గుర్తు మాత్రమే.

మా ఆశయంలో భాగమవ్వండి

నయీదిశ వేదికగా నేను ఏమేం చేయగలను?

నయీదిశ వేదికగా, మీరు:

a. అన్ని స్థాయిలలో ప్రాథమికంగా పోటీ చేయవచ్చు మరియు అభ్యర్థులకు వోటు వేయవచ్చు.
b. అభ్యర్థులు మరియు నాయకుల ప్రదర్శనను సమీక్షించవచ్చు
c. ముఖ్యమైన పాలసీ సమస్యలపై మీ అభిప్రాయాలను పంచుకుని చర్చించవచ్చు
d. మీ ప్రాంతంలో ఇతర నయీదిశ సభ్యులను కలిసి,వారి గురించి తెలుసుకోవచ్చు
e. వాలంటీర్ మరియు ఛాంపియన్ గా మీరు,ఇలా సాయపడవచ్చు:

 • అందరికీ దీని గురించి చెప్పి కొత్త సభ్యులను చేర్పించవచ్చు
 • స్థానిక సమావేశాలు/చర్చలు నిర్వహించటం లేదా పాల్గొనటం
 • ప్రతి ఇంటికి వెళ్ళి సర్వేలు నిర్వహించటం
 • కొత్త ఓటర్లను రిజిస్టర్ చేయించటం
 • ప్రజాసంపద డేటాను ఒకచోటికి సేకరించడం
 • నిధుల సమీకరణ
 • వివిధ స్థానిక ప్రచార క్యాంపెయిన్లు
 • ఎన్నికలు దగ్గరపడుతున్నప్పుడు, ఓటర్లు ఓటు వేసేలా చూడటం
 • వేదిక గురించి మరింత చదవండి

  పోటీచేసే ప్రాథమిక అభ్యర్థులకి (ప్రైమరీలు) కనీస వయస్సు పరిమితి ఉన్నదా?

  అవును, నయీదిశ సభ్యులు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉంటేనే ప్రైమరీలుగా బూత్ మరియు నియోజకవర్గం బ్లాక్ స్థాయిలో పోటీచేయగలరు. శాసనసభ మరియు పార్లమెంట్ నియోజకవర్గాల స్థాయిలకి, 25 సంవత్సరాలు కనీస వయస్సు పరిమితిగా రాజ్యాంగ సూచనలను అనుసరిస్తూ నిర్ణయించబడింది.

  ప్రైమరీల గురించి చదవండి.

  మీరు బిజెపి/కాంగ్రెస్/ఆప్ కి చెందినవారా,కేవలం ఓట్లు చీల్చడానికి ఇది కొత్తగా మొదలుపెట్టారా?భవిష్యత్తులో, అవసరమైతే పెద్ద రాజకీయ పార్టీలలో కలిసిపోతారా?

  కాదు, నయీదిశ ఏ రాజకీయ పార్టీకి సంబంధించి పనిచేయట్లేదు. ఇది మనదేశంలో ప్రస్తుత రాజకీయాల పట్ల విసిగిపోయిన, విశాల భావాలున్న భారతీయుల కోసం ఏర్పడిన ఒక కొత్త మరియు స్వతంత్ర వేదిక. మేము ఎప్పుడూ ఒక ప్రజాస్వామిక రాజకీయ వేదికగానే ఉంటాము.మా బలం మా సభ్యులు మరియు అభ్యర్థుల కొత్త ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానం నుంచే వస్తుంది, రాజకీయ కూటముల నుంచి కాదు.

  ప్రసుత రాజకీయ పరిస్థితులతో సంతోషంగా లేకపోతే, మాతో చేరండి.

  మీరు కేవలం ఒక వేదిక, నేను కేవలం ఒక ఓటరును.మనం నిజంగా మార్పును తేగలమా?నయీదిశ ఎలా ఏదీ నిర్ణయించుకోలేని మరియు ఓటే వేయని వారిని ఒకతాటిపై తేవాలని ఆలోచిస్తోంది?

  మీలాగే, లక్షలాది మంది తమ ఒక్క వోటు ఏ తేడాను తీసుకురాదు అనుకుంటారు. కానీ మనదేశంలో ప్రభుత్వాలు తరచుగా 1/3వ భాగం ఓటర్ల మెజారిటీ కన్నా తక్కువతోనే ఏర్పడతాయి.

  ఉదాహరణకి, 2014 సార్వత్రిక ఎన్నికలలో, 83.4 కోట్లమంది అర్హులైన ఓటర్లుంటే 28.7 కోట్ల మంది అందులో ఓటు వేయలేదు. గెలిచిన పార్టీ,బిజెపికి కేవలం 17 కోట్ల ఓట్లే వచ్చాయి.ఊహించండి, ఆ 28.7 కోట్లమంది ఓటు వేసి ఉంటే, ఆ ఎన్నికల ఫలితాలే పూర్తి వేరుగా మారి ఉండేవి.

  చాలామంది తమ వోటు వల్ల ఏం జరగదని ఓటు వేయడం మానేస్తారు. డేటా గణాంకాల ప్రకారం, అది నిజం కాదు. మనందరం ఒక మార్పు కోసం కలిసి ఓటేస్తే, మన దేశాన్ని కిరాతక రాజకీయ నాయకుల గుప్పిట్లోంచి విడిపించి, ఒక నయీ దిశలో ముందుకి నడిపించటాన్ని ఎవరూ ఆపలేరు.

  మనలో చాలామందిలో నాయకులు దాగున్నారని మేము నమ్ముతున్నాం. మన చుట్టూ మార్పు చూడాలనే కోరిక ఉన్నా, మనకి దాని గురించి ఏం చేయాలో, ఎలా చేయాలో చాలాసార్లు తెలీదు. నయీదిశ అలాంటి వ్యక్తుల కోసం అన్ని స్థాయిలలో నిర్మాణాన్ని మీరే నిర్ణయించి, నిర్వహించే వీలుగా, ఒక విశాలభావాలున్న వేదికను అందిస్తుంది.

  మీకెప్పుడైనా మీ ఒక్క గొంతు మార్పును తేలేదని, లేదా మీ ఒక్కరి నిర్ణయాలు ఫలితాలను లేదా పాలసీలను మార్చలేవని అన్పించిందా, లేదా రాజకీయాలలో కుళ్ళుకంపును చూసి దానికి మీరు దూరంగా ఉంటున్నారా? నయీదిశ కొత్తరకపు రాజకీయ మరియు పాలనా మోడల్ ను మీకు అందించి మీరు నిజమైన మార్పు తెచ్చేలా సాయపడుతుంది.

  మీరూ మార్పులో భాగమవ్వవచ్చు. నయీదిశలో చేరండి.

  అభ్యర్థిని ఎంపిక చేసే ప్రక్రియలో మీ పద్ధతి ఎప్పుడూ కింది నుంచి పైకి అయినప్పుడు, మీరు స్థానిక సమస్యలపై కూడా పోరాడుతారా?

  నయీదిశ తన సభ్యులను స్వంతంగా నిర్వహించుకునేలా ప్రోత్సహించే ఒక విశాలభావాలున్న వేదిక, ఇది సంప్రదాయ అధికార స్థాయిల ప్రకారం పనిచేయకుండా ఒక జట్టులా పనిచేయటంలో ఉన్న శక్తిని నమ్ముతుంది. ఈ వేదికను ఉపయోగించుకుని, సభ్యులు తమ స్థానిక సమస్యలను సులువుగా పరిష్కరించుకోటానికి మార్గాలను వెతుక్కోవచ్చు. వారు సమావేశాలు, కార్యక్రమాలు, పాలసీ చర్చలు అన్నిటికీ కలసి వచ్చి, స్థానిక మరియు జాతీయ ప్రాముఖ్యత ఉన్న విషయాలపై తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. నయీదిశ స్థానిక ప్రజలకి కూడా శక్తి మరియు నిర్ణయాధికారం తేవాలని తపిస్తోంది.

  వేదిక గురించి మరింత చదవండి

  ప్రజలు ఈవియంలను ప్రశ్నిస్తూ, పేపర్ బ్యాలెట్ల వైపు మొగ్గుచూపుతున్నారు,నేను మీ వేదికను ఎందుకు నమ్మాలి? మీ ఆశయాల కోసం విరాళాలు ఇచ్చిన కొంతమంది ఇష్టమైన వారిని గెలిపించి ముందుకు పంపటం కోసం మీరే ఓట్లను రిగ్గింగ్ చేయవచ్చు.

  నయీదిశ ఇక్కడ ఇప్పటివరకూ కొనసాగుతున్న రాజకీయాలను మార్చటానికే వచ్చింది మరియు అది తన ఆశయాన్ని ఓడించే ఏ రకమైన రిగ్గింగ్ లాంటి పనులలో పాలుపంచుకోదు. ఇంకా చెప్పాలంటే, ప్రతి సభ్యుడిని సిస్టమ్ లో ప్రత్యేకంగా గుర్తించటం జరుగుతుంది, అలాగే అనేక ధృవీకరణల ద్వారా న్యాయంగా,సరైన పద్ధతిలో ఎన్నికల వరకు వెళ్ళటం జరుగుతుంది.

  70ఏళ్ళుగా ఎవరూ నెరవేర్చలేకపోయిన హామీలను మీరు మాత్రం ఎలా తీరుస్తామనుకుంటున్నారు? మా ప్రాథమిక సమస్యలైన నాణ్యతలేని చదువు, ఆరోగ్యం మరియు న్యాయపాలన ఇవన్నీ నయీదిశ ఎలా పరిష్కరిస్తుంది?

  అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు మరియు నాయకులకి మన దేశ దిశను మార్చాలన్న కోరికగానీ, ప్రేరణకానీ ఎలాగో లేవు, అందుకే భారతదేశాన్ని అదే పేదరికం మరియు విదేశీయుల పాలన లాగా అవసరం కోసం వాడుకునే మార్గంలోనే ఉంచేసారు. ప్రధానంగా అధికారంలో ఉండాలనే కాంక్షతో, భారతీయులను ఓట్లకి బదులుగా ప్రభుత్వంపై, ప్రభుత్వం ఇచ్చే కోటాలపై ఆధారపడటంలోనే ఉంచేసారు. నయీదిశ సంపన్నబాటలో దేశాన్ని నడిపించటానికి తన సిద్ధాంతాలను ప్రయత్నిస్తుంది. ఇంతకుముందు ఏ ప్రభుత్వం మన దేశాన్ని ధనికదేశంగా సుసంపన్నం చేస్తామనే మాటలను నిలబెట్టుకోలేకపోయింది, వాటిని నయీదిశ తన సిద్ధాంతాలతో నెరవేరుస్తుంది. నయీదిశ సభ్యుడికి లేదా నాయకుడికి, అధికారం లక్ష్యం కాదు.

  తన సమృద్ధి సూత్రాలను ఉపయోగించి ఏ ప్రభుత్వం ప్రయత్నించని విధంగా భారతీయులను సంపన్నబాటలో నడిపించటానికి ప్రయత్నిస్తుంది. నయీదిశ మద్దతుదారు లేదా నాయకుడికి అధికారం ఒక మార్గమే కానీ లక్ష్యం కాదు.

  నయీదిశ చట్టాలను బలంగా మార్చి, దేశాన్ని పాలించటానికి స్పష్టమైన, సింపుల్ నియమాలను ప్రవేశపెడ్తుంది. పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలను తెరవడానికి భారంగా మారుతున్న విషయాలను తగ్గించాలని నయీదిశ ఆలోచిస్తోంది. అనేక సేవా కేంద్రాలను తెరవడం ద్వారా మరియు ప్రజా సంపద తిరిగివ్వటం వలన చేతికి వచ్చే అదనపు డబ్బు వలన, ప్రతి ఒక్కరికి నాణ్యమైన చదువు మరియు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అందుబాటులోకి వస్తుంది.

  మా మిషన్ గురించి మరింత చదవండి

  ప్రత్యర్థి పార్టీల అనుచరులు(గూండాలు), తమ అభ్యర్థులను బెదిరించినప్పుడు నయీదిశ ఎలా వారినుంచి తన అభ్యర్థులను రక్షిస్తుంది?

  ఒకసారి ప్రజల ద్వారా ఉద్యమం ముందుకి వెళితే,ఇక మమ్మల్ని ఎవరూ ఆపలేరు. మేము ఇదివరకే తమ స్థానం ఏర్పర్చుకున్న పార్టీల నుంచి,వ్యక్తుల నుంచి తిరస్కరణ ఎదురవదు, రిస్క్ లేదు అనటం లేదు కానీ మన దేశ భవిష్యత్తు కోసం, ఒక సంపూర్ణ సంపన్న భారతంలో నివసించడానికి మనం ఈ మాత్రం రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. భారతదేశంలో అనేక రాజకీయ ఉద్యమాలు నిబద్ధత, ఆలోచనలు కల కొద్దిమంది వ్యక్తుల బృందాల నుంచే మొదలయ్యాయి. అందరూ భయంతోనే ఆగిపోయి ఉంటే, మనం ఇప్పటికి కూడ విదేశీ శక్తుల పాలనలోనే మగ్గిపోయేవాళ్ళం.

  నయీదిశ నిధులు ఎలా సమీకరిస్తుంది?

  నయీదిశకి మొదట పెట్టుబడి రాజేష్ జైన్ అందించారు. మరిన్ని నిధుల కోసం, మేము త్వరలోనే అందరి వద్దకూ దీన్ని తీసుకెళ్ళాలనుకుంటున్నాం. ఎవరికి నచ్చినంత వారు సాయం చేయవచ్చు మరియు ఇదంతా చాలా పారదర్శకంగా జరుగుతుంది.

  మీరు నయీదిశలో చేరి కూడా సాయపడవచ్చు

  నయీదిశకి సంబంధించిన వ్యక్తులు ఎవరు?వారి హోదా మరియు పాత్ర ఏమిటి?

  నయీ దిశను రాజేష్ జైన్ మొదటగా అంకురార్పణం చేసారు. మా సభ్యులు అన్ని రంగాలు మరియు అన్ని వయస్సులకి చెందిన వారు – విద్యార్థులు, వ్యాపారవేత్తలు, వకీళ్ళు, ఆర్థికవేత్తలు, రైతులు మరియు యువ ప్రొఫెషనల్స్. మరింత ఎదగటానికి ఈ ఉద్యమానికి చాలామంది నాయకులు, ఛాంపియన్లు మరియు వాలంటీర్లు అవసరం. మన దేశాన్ని సంపన్నబాటలోకి నడిపించే వారి కోసం మేము వెతుకుతున్నాం.

  వ్యవస్థాపకుడు, రాజేష్ జైన్ గురించి మరింత చదవండి

  2014 ఎన్నికల్లో రాజేష్ జైన్ మోడీకి ఓటు వేసి గెలిపించలేదా?మరి ఇప్పుడు ఇది ఎందుకు చేస్తున్నారు?ఆయన ఒక వ్యాపారవేత్త;ఇది కూడా ఆయన వ్యాపారానికి సాయపడే వేదిక మాత్రమే కాదని నాకు ఎలా తెలుస్తుంది?

  అవును,అతను అలా చేసారు. 2014లో బిజెపి మెజారిటీతో గెలిచిన తీరు చూసి, అందరూ కొత్త ప్రభుత్వం అనేక దశాబ్దాల నుంచి కొనసాగుతున్న పనితీరు, చెత్త పాలసీలను ప్రాథమిక స్థాయి నుంచి ఇకనైనా మార్చి దేశాన్ని సంపన్నబాటలో నడిపిస్తుందని భావించారు. అనేక పథకాలు కొత్తగా ప్రారంభించినా, చాలామటుకు పాత పద్ధతులు,పాలసీల ప్రభావం వీటిపైనా కొనసాగి, మన దేశం పేద దేశంగానే నిలిచిపోయింది. మన దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఒక రకమైనవేనని, ప్రజల జీవితాలను మార్చడానికి వారి వద్ద ఏ పరిష్కారాలు లేవని రాజేష్ అర్థం చేసుకున్నారు. దేశం పురోగతి సాధించాలంటే కొత్త పాలకుల కన్నా ఆలోచనా తీరులో,చట్టాలలో మార్పు రావాలి. తన వృత్తిజీవితం మొత్తంలో, రాజేష్ ఎల్లప్పుడూ నిజాయితీగానే ఉన్నారు మరియు ఏనాడూ అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదు. కష్టించి పనిచేయటాన్ని నమ్మే వ్యక్తిగా ఆయన తన స్వంతంగా ఎదిగారు.

  మన దేశాన్ని సంపన్న బాటలో నడిపించే వ్యాపారాలు పెరగటానికి కావలసినవి మరియు లక్షలాది యువతకి ఉద్యోగాలు సృష్టించటానికి అవసరమైనవి ఏంటని రాజేష్ అర్థం చేసుకున్నారు. నయీదిశ ద్వారా, వ్యాపారవేత్తగా ఆయన ప్రయాణం కొనసాగుతుంది,కాకపోతే వేరే రకంగా- దేశ నిర్మాణంలో. మన దేశానికి పెద్ద మార్పు కావాలని రాజేష్ బలంగా నమ్ముతారు మరియు మనలో ప్రతి ఒక్కరు ఆ విప్లవంలో రాజకీయ వ్యాపారవేత్తలు కావాల్సి ఉంటుంది.

  భారతదేశంలో సంపన్నమైన మరియు మిలియన్ల మంది యువజనులకు ఉద్యోగాలు కల్పించడానికి వ్యాపారాలు అవసరమనేది రాజేష్ అర్థం. నాయీ దిశ ద్వారా, ఒక వ్యాపారవేత్తగా తన ప్రయాణం కొనసాగుతుంది, కానీ ఇప్పుడు వేరే డొమైన్లో - దేశం భవనం. భారతదేశం పరివర్తన అవసరం కావాల్సిన అవసరం ఉందని, మనలో ప్రతీ ఒక్కరూ ఆ విప్లవంలో రాజకీయ వ్యవస్థాపకులుగా ఉండాలి.

  నయీదిశ పట్ల రాజేష్ ప్రేరణ గురించి చదవండి

  రాజేష్ జైన్ కూడా ఎన్నికల్లో అభ్యర్థిగా నుంచుని ప్రధానమంత్రి అవుతారా?

  రాజేష్ కి ఎటువంటి రాజకీయ లక్ష్యాలు లేవు. కానీ ఒకవేళ ఆయన ఎన్నికలలో నుంచోవాలని భావిస్తే, నయీదిశ నియమాలు మరియు నిబంధనలు ఆయనకి కూడా వర్తిస్తాయి. దాని ప్రకారం, అభ్యర్థులు ప్రభుత్వం యొక్క అన్ని స్థాయిల ఎన్నికలలో నుంచోటానికి మొదట ప్రైమరీలుగా గెలవాల్సి ఉంటుంది.

  ఇంకా తెలుసుకోవడానికి, రాజేష్ స్టేట్ మెంట్ ఆఫ్ పర్పస్ ను చదవండి

  నేను నయీదిశలో ఎందుకు చేరాలి?

  మీరు కూడా పేదరికమే మన గమ్యం కాదనే నమ్మితే మీరు తప్పక నయీదిశలో చేరాలి.మీరు కూడా మనకి భారతీయులుగా, భారతదేశాన్ని సమృద్ధి చెందిన దేశంగా, ఆధునిక దేశంగా మార్చే కర్తవ్యం ఉందని నమ్మితే, మీరు నయీదిశలో తప్పక చేరాలి.

  మీకు మా సిద్ధాంతాలపై నమ్మకం కలిగితే మరియు ఈ మార్పులో భాగస్వామి కావాలనిపిస్తే, నయీదిశలో భాగం అవ్వండి.

  మా ఆశయంలో భాగమవ్వండి. వాలంటీర్ గా మారండి.

  నేను నయీదిశకు ఎలా సాయపడగలను?నయీదిశ సభ్యుల పాత్ర ఏమిటి?

  మీరు ఇది అడిగి మంచిపని చేసారు. మీరు మమ్మల్ని చాలా రకాలుగా సపోర్ట్ చేయవచ్చు:

 • మీకు దేశ రాజకీయాలు బాధ కలిగించో లేదా బోరు కొట్టించి ఉండి, నయీదిశ మార్పు ఎలా తీసుకొస్తుందో అర్థం చేసుకోవాలనుకుంటే,మా ఈ మెయిల్ లేదా మొబైల్ సమాచారం కోసం సైన్ అప్ అవ్వండి.
 • మీకు మా లక్ష్యం పట్ల ఆసక్తి ఉంటే, మీ ఓటర్ ఐడితో రిజిస్టర్ అయ్యి, యాక్టివ్ సభ్యుడిగా మారండి.
 • ఒకవేళ మాతో పాటు కొత్త దిశలో నడవటానికి మీరు కూడా ప్రేరణ పొందినట్లయితే, వాలంటీర్ గా పనిచేయండి, మా పనిని, ఆశయాలను పదిమందికీ చేరవేయండి లేదా మా ప్రతినిధిగా లేదా స్థానిక నాయకుడిగా మారండి.
 • నయీదిశ సభ్యులు భారతదేశ భవిష్యత్తును నిర్మించేవారు, తీర్చిదిద్దేవారు. మా సభ్యులు అన్ని స్థాయిలలో నిర్ణయం తీసుకునే అధికారం కలిగి వుంటారు మరియు నిర్మాణంలో భాగమవుతారు.

  మా లక్ష్యం, ఆశయాన్ని మీరూ నమ్మితే, నయీదిశలో చేరండి

  రిజిస్ట్రేషన్ కు నా ఓటర్ ఐడి ఎందుకు అవసరం? నా వ్యక్తిగత వివరాలు(అనగా ఓటర్ ఐడి, ఫోన్ నెంబరు, మొదలైనవి) సురక్షితంగానే ఉంటాయా?

  ఓటరు ఐడి వివరాలు మాకు సభ్యులను గుర్తించడానికి, ప్రతి నియోజకవర్గంలో నయీదిశకు ఉన్న అండను తెలుసుకోడానికి ఉపయోగపడతాయి. నయీదిశ వెబ్ సైట్ పై ఎప్పటికప్పుడు సభ్యత్వ వివరాలపై సేకరించిన సమాచారం ప్రకటింపబడుతూ ఉంటుంది.

  మీ డేటా మాతో పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. అది చాలా సురక్షితమైన వాతావరణంలోనే ఉంచబడుతుంది. మీ డేటా గోప్యత మరియు ప్రైవసీ ఉన్నత స్థాయిలో చూడబడతాయి, మేము దాన్ని దుర్వినియోగం చేయం.

  వేదిక గురించి మరింత చదవండి.

  ఇప్పుడు మాకు చేరండి

  నాకు నయీదిశపై ఆసక్తిగా ఉన్నది, కానీ నా ఓటరు ఐడి వివరాలు చెప్పటం ఇష్టం లేదు? అయినా నేను ఇందులో చేరవచ్చా?

  అవును, మీరు చేరవచ్చు. ఓటరు ఐడితో మీరు మా సభ్యులుగా చేరలేకపోయినా, మీరు నయీదిశకు అండగా ఉండటానికి అనేక మార్గాలున్నాయి. మీరు ఇలా చేయవచ్చు:

 • a) సోషల్ మీడియాపై మమ్మల్ని ఫాలో అయి మరియు నయీదిశ గురించి కుటుంబం మరియు స్నేహితులతో పంచుకుని ఉద్యమాన్ని పెంచండి.
 • b) నయీదిశ కార్యక్రమాలు మరియు సమావేశాల్లో వాలంటీర్ గా పనిచేయండి లేదా స్థానిక లోకల్ ఛాప్టర్ మొదలుపెట్టడానికి సాయపడండి.
 • నయీదిశకి సాయపడి మీరు పాయింట్లు కూడా పొందవచ్చు. ఓటరు ఐడితో సభ్యులకి, ప్రైమరీలకి ఓటేసే హక్కు లేదా ఏ స్థాయిలోనైనా అభ్యర్థిగా నుంచునే అర్హత వస్తుంది. మీ ఓటర్ ఐడితో సైన్-అప్ వెంటనే, మీరు చేసిన పనులకి వచ్చిన పాయింట్లు మీ కొత్త అప్ గ్రేడెడ్ ప్రొఫైల్ కి మార్చబడతాయి.

  మా ఆశయంలో భాగమవ్వండి. నయీదిశలో చేరండి.

  నయీదిశ తన సభ్యులతో ఎలా పనులలో నిమగ్నం అవుతుంది?

  నయీదిశ తన సభ్యులతో పనుల విషయంలో కనెక్ట్ అవడానికి మరియు వారికి అండగా ఉండటానికి వివిధ డిజిటల్ పద్ధతులను వాడుతుంది. అవి నయీదిశ యాప్, బ్లాగులు, ఫోరంలు మరియు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్ టాగ్రామ్, వాట్’స్ యాప్ వంటి వాటిలో సోషల్ మీడియాను చాలా ఉపయోగించుకుంటుంది. నయీదిశకు సపోర్టు పెరిగేకొద్దీ, మేము స్థానికంగా కూడా లోకల్ ఛాప్టర్స్ మొదలుపెడతాం, అవి క్రమం తప్పకుండా సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహిస్తాయి.

  నయీదిశ బృందంలో మీరూ భాగమవ్వండి. ఇప్పుడే చేరండి

  ఇంకా ప్రశ్నలున్నాయా. దర్శించండిFAQs.

  ఎప్పటికప్పుడు అప్ డేట్ అవ్వండి

  మీ వాట్సాప్ నంబర్ పై రోజువారీ విశేషాలు పొందండి

  మీ ఆసక్తికి ధన్యవాదాలు

  ఎస్సెమ్మెస్ అప్ డేట్ల కొరకు, 9223901111కు మిస్డ్ కాల్ ఇవ్వండి

  ఈమెయిల్ లో అప్ డేట్లు పొందండి

  మీ ఇన్ బాక్స్ లోకే రోజువారీ విశేషాలను పొందండి

  ఈమెయిల్ ద్వారా కొత్త విశేషాలు వద్దనుకుంటున్నారా?

  మొబైల్ పై అప్ డేట్లు పొందండి

  నయీదిశతో కనెక్ట్ అయి ఉండండి